telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పౌరసత్వ చట్టంపై .. కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణి వీడాలి.. : ప్రశాంత్ కిషోర్

nda will get power again said prasanth kishore

సిటిజన్ బిల్లు గురించి దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ బిల్లు విషయంలో జెడియు ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఈ బిల్లును అయన వ్యతిరేకిస్తున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ బిల్లు వలన ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. ఇబ్బందులు వస్తాయని అంటున్న ప్రశాంత్ కిషోర్ వచ్చే ఇబ్బందులు ఏంటి అనే విషయం మాత్రం చెప్పడం లేదు. బీహార్ లో జెడియు, బీజేపీలు మిత్రపక్షంగా ఉంటున్నాయి. బిల్లు విషయంలో సభలో మద్దతు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ బలవంతం మీదనే అయన వ్యతిరేకిస్తున్నారు. ఇలా వ్యతిరేకించడానికి కారణం ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది. కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నిరసనలకు మద్దతు తెలుపుతూ రోడ్డుపైకి వచ్చి కొంతమంది నేతలు నినాదాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టింగ్ లు పెడుతున్నారు. అయితే, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు ఈ విషయంలో బయటకు రాకుండా, ఎలాంటి కామెంట్లు చేయకపోవడం ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తుందని ప్రశాంత్ కిషోర్ అంటున్నాడు.

ప్రశాంత్ కిషోర్ కేంద్రంపై ఇంతగా వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేస్తున్నాడో అర్ధం కావడం లేదు. బీహార్ లో మిత్రపక్షంగా ఉన్న జేడీయు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీని సైడ్ చేయాలని ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే బీజేపీపై ఫైర్ అవుతున్నారని తెలుస్తోంది. బీజేపీని కాదని జెడియు ఒంటరిగా పోటీ చేస్తే రాష్ట్రంలో ఎంతమేరకు మనుగడ సాగించగలుగుతుంది అన్నది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఈ బిల్లుల విషయంలో బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో వెనకబడి ఉండొచ్చు. తరువాత తప్పకుండా పుంజుకుంటుంది. అందుకు ఉదాహరణ మహారాష్ట్ర, కర్ణాటకలు. కర్ణాటకలో సొంతంగా పార్టీని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. చాలా రాష్ట్రాల్లో బలంగా ఉన్నది. ఇప్పుడు దేశం మొత్తం బీజేపీ వ్యాపించాలని చూస్తున్నది. అందుకే అడ్డుకట్ట వేయడానికి ఆయా పార్టీలు విరోధం పెంచుకుంటున్నాయి.

Related posts