telugu navyamedia
సినిమా వార్తలు

“ప్రణయ రాగమా”!

na varija netri poetry corner
పల్లవించిన నా ప్రేమ
 గీతానికి ప్రాణం నీవే-
ప్రతి ఉదయం ప్రభవించీ
 జగతికి  ప్రేమను పంచే –
“ఉష్ణ” కిరణ సంచయంలో
 ప్రాచీదిశాంగన నుదుట 
కుంకుమ నీవే-
సేద తీర్చే “పవనం”లో
 గుసగుసల ప్రేమ భాషవి నీవే-
“గగన”తలాన తెల్లని దూది
 మబ్బుల వలపుల ఊహల పల్లకీలో
 ఊరేగే ప్రేమ దేవత నీవే-
నా డెంద మనే బీడు “నేల”పై
 వర్షించే ప్రణయ “వృష్టి”వి నీవే-
వలపుల భువిలో
 ప్రశాంతత నొసగే ప్రేమ క్షేత్రం నీవే-
పంచభూతాల పరిష్వంగంలో
 ప్రకృతై శోభిస్తున్నావు –
నా జీవన తీరాన్ని చేర్చే 
 ప్రణయరాగమై నినదిస్తున్నావు-
-అంశు మాలి, టెక్కలి

Related posts