telugu navyamedia
news telugu cinema news

ప్రణయ…

pranaya poetry corner
“చెలీ! కరుణించు!”
నీ వలపు కడలిలో ప్రణయ కెరటాన్నై పరవశిస్తున్నా-
పడి లేచే ఊహల లాహిరిలో అనంతకోటి శకలాలై విరిగిపడుతున్నా-
నీ నడుమొంపులో నెలవంక వెలుగునై కరిగిపోవాలని తపన పడుతున్నా-
నీ హృదయ  సామ్రాజ్యంలో చిన్ననాటి చిరు తలపునై సదా పయనిస్తున్నా-
నీరజేక్షణా! 
నీ   సోయగాల కనుగవ లో వలపు పడవనెక్కి ఊరేగుతున్నా-
పూర్ణేందు వదనా!
 నీ మేను జవ్వాజి పరిమళంలో  నాలో నేను ఉదయిస్తున్నా-
ఇంకానా! జాగేల! చెలీ! నా హృదయ కేదారంలో నిండుగా మృగనేత్రిగా  విహరించు!
చెలీ!  నా ప్రేమను కరుణించు!
-అంశుమాలి, టెక్కలి

Related posts

వేల సంఖ్యలో ఓట్ల తేడా ఎలా వచ్చిందో చెప్పాలి: షబ్బీర్‌ అలీ

vimala p

ఒంటరి పోరాటమే.. ఏ పార్టీతో పొత్తులు.. ఎన్నికల ముందు ఉండవు.. జనసేన..

vimala p

రహస్యం రహస్యమే… రాఫెల్ పై సుప్రీంకోర్టు…

vimala p