telugu navyamedia
తెలంగాణ వార్తలు సామాజిక

పోలీసుల సహకారంతోనే తాము బతుకుతున్నాం: ప్రణయ్ తల్లిదండ్రులు

pranay parents to police station for
పోలీసులు, మీడియా సహకారంతోనే తమ కుటుంబం బతుకుతోందని ప్రణయ్ తల్లిదండ్రులు తెలిపారు. జనవరి 30న అమృతకు కొడుకు పుట్టిన అనంతరం శుక్రవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమ కుమారుడు మళ్లీ పుట్టాడని, తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.   మిర్యాలగూడలో భద్రత లేకపోవటంతో డెలివరీ కోసం హైదరాబాద్‌ ఆస్పత్రికి వచ్చామని వారు తెలిపారు. నెల రోజులుగా ఎవరీ తెలియకుండా బతుకుతున్నామన్నారు. ఫిబ్రవరి ఒకటిన ప్రణయ్ జన్మదినమని, ప్రణయ్- అమృత పెళ్ళి రోజునే వారికి కొడుకు పుట్టాడని చెప్పుకొచ్చారు.
తన ప్రాణం పోయినా న్యాయం కోసం పోరాడతానని ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పష్టం చేశారు. కులం వలనే తన కుమారుడు హత్య చేయబడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఆ భయం వల్లే అమృత డెలివరీ విషయాన్ని మీడియాకు చెప్పలేకపోయామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో మిర్యాలగూడకు వెళ్తున్నామని, తమకు పోలీసులే రక్షణ కల్పించాలని బాలస్వామి విజ్ఞప్తి చేశారు. మారుతీరావు లాంటి వాళ్ళు ఇంకా సమాజంలో ఉన్నారని ప్రణయ్ తల్లి ప్రేమలత అన్నారు. మారుతీరావు భార్య తమ ఇంటికి కొందరు మద్యవర్తులను పంపి బెదిరిస్తోందని, తమకు రక్షణ కల్పించాలని  ప్రేమలత కోరారు.

Related posts