telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

సమాజం కోసమే రాజకీయాల్లోకి: ప్రకాశ్‌రాజ్‌

Praksh Raj meet TRS Working President  Ktr

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ బుధవారం క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఈ సందర్భంగా తన రాజకీయ ప్రవేశ విషయమై కేటీఆర్‌తో చర్చించారు. సమాజం కోసమే రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించిన ఆయన, తన రాజకీయ ప్రవేశానికి కేటీఆరే స్ఫూర్తి అని పేర్కొన్నారు.

అనంతరం కేటీఆర్‌తో భేటీ ఫొటోలను ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. కేటీఆర్‌ ఇచ్చిన స్ఫూర్తి దాయక మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించిన ఆయన, ఇక నుంచి తన పోరాటాన్ని పార్లమెంటులోనూ కొనసాగిస్తానని ట్వీట్‌లో ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.

Related posts