• Home
  • వార్తలు
  • విద్యార్థులకు కేంద్ర మంత్రి శుభవార్త..ఎన్‌సి‌ఈఆర్‌టీ సిలబస్ తగ్గింపు!
రాజకీయ వార్తలు వార్తలు విద్య వార్తలు

విద్యార్థులకు కేంద్ర మంత్రి శుభవార్త..ఎన్‌సి‌ఈఆర్‌టీ సిలబస్ తగ్గింపు!

Prakash Javadekar, NCERT Syllabus, Students

విద్యార్థులకు కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ శుభవార్త చెప్పారు. అధిక సిలబస్ వల్ల విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారనే విషయాన్ని గ్రహించి ఎన్‌సి‌ఈఆర్‌టీ కొన్ని మార్పులు చేసింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సి‌ఈఆర్‌టీ) సిలబస్ ను 10 నుంచి 15 శాతం తగ్గిస్తామని ప్రకాష్ జవడేకర్ వెల్లడించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎన్‌సి‌ఈఆర్‌టీ సిలబస్ ను తగ్గించే  ప్రక్రియను చేపడుతామని మంత్రి ప్రకటించారు.

సిలబస్ తగ్గించాలని కోరుతూ దేశవ్యాప్తంగా లక్షమంది ప్రజల నుంచి సూచనలు వచ్చాయని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు. ఎంబీబీఎస్ చదివి డాక్టరు, ఇంజినీరింగ్ చదివి ఇంజినీరు అయినట్లుగా ఉపాధ్యాయులు కావాలనుకునే వారు నాలుగేళ్ల పాటు డిగ్రీతోపాటు బీఈడీ చదివేలా కొత్త విద్యావిధానం ప్రవేశపెడతామని మంత్రి పేర్కొన్నారు. దేశంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా నిరంతర శిక్షణ అందించేలా కార్యక్రమం చేపడతామని మంత్రి జవడేకర్ వివరించారు.

Related posts

టి కాంగ్రెస్ సభ్యులలందరూ రాజీనామా!?

admin

ప్రైవేట్ వర్సిటీల బిల్లును అడ్డుకుంటాం : విద్యార్ధి సంఘాలు

admin

దుబాయ్ కి పాక్ ప్రధాని.. నేటి మ్యాచ్ చూడాల్సిందేనట…

chandra sekkhar

Leave a Comment