telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రగతి భవన్ ముట్టడిలో కేసీఆర్ మనవడు.!

Pragati bhavan Nsui

ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు నిన్న ప్రగతిభవన్ ను ముట్టడించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. పీపీఈ కిట్లు ధరించి ప్రగతి భవన్ ను ముట్టడించిన 37 మంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.అనంతరం అందరినీ రిమాండ్ కు తరలించారు. వీరందరికీ 14 రోజుల రిమాండ్ విధించారు.
అయితే, ముట్టడించిన వారిలో కేసీఆర్ కు వరుసకు మనవడు అయ్యే రితేశ్ కూడా ఉండటం కలకలం రేపుతోంది.

కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు కుమారుడే రితేశ్ కావడం గమనార్హం. ఈ కేసులో రితేశ్ ను ఏ5గా పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు తన కుమారుడిని కేసులో ఇరికించారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రమ్యారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. విద్యార్థుల జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని అన్నారు. విద్యార్థులను రిమాండ్ కు పంపించడం అత్యంత దారుణమని మండిపడ్డారు.

Related posts