సినిమా వార్తలు

నేడు కోర్టుకు ప్రదీప్

డిసెంబర్ 31న అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం సేవించి, వాహనం నడిపినందుకు యాంకర్ ప్రదీప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రదీప్ కారుకు బ్లాక్ ఫిలిం కూడా ఉండడంతో మరో కేసు కూడా నమోదైంది.

ఈ విషయం వివాదాస్పదంగా మారి ప్రదీప్ హైదరాబాద్ పారిపోయాడనే వార్తలు హల్చల్ చేశాయి. కానీ ప్రదీప్ తానెక్కడికి పారిపోలేదని, షూటింగుల వల్ల కౌన్సెలింగ్ కు హాజరుకాలేదని ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

జనవరి 8న తన తండ్రితో కలిసి గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కౌన్సెలింగ్ కు హాజరయ్యాడు. అంతేకాకుండా తాగి కారు నడపడం తప్పేనని, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటానని చెప్పాడు. అయితే ఈ రోజు ప్రదీప్ నాంపల్లి కోర్టుకు హాజరవుతున్నాడు.

డంక్ అండ్ డ్రైవ్ మరియు కారుకు బ్లాక్ ఫిలిం రెండు కేసుల్లోనూ కనీసం మూడురోజులపాటు అతనికి జైలు శిక్ష విధించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Related posts

బంగారు తెలంగాణ ఆడియో విడుదల

admin

“సిల్లీ ఫెలోస్” సరికొత్త రికార్డు

vimala t

ఆంధ్రాలో అజ్ఞాతవాసికి 'బాబో'య్ ..!

admin

Leave a Comment