telugu navyamedia
సినిమా వార్తలు

“సాహో” హిందీ వెర్షన్ కు నో కట్స్

Saaho

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెష‌ల్ డ్యాన్స్‌తో అల‌రించ‌నుంది. బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 30న విడుదల కానున్న ఈ సినిమా హిందీ వెర్షన్ నేడు సెన్సార్ పూర్తి చేసుకుంది. ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సెర్టిఫికేషన్ ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అది కూడా సినిమాలో ఎలాంటి సన్నివేశాలు తొలగించకుండా. తమిళ, తెలుగు వెర్షన్లు వారం రోజుల ముందుగానే సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను ఐ-మ్యాక్స్ కెమెరాతో షూట్ చేయగా, ఐ-మ్యాక్స్ ఫార్మాట్‌లోనే రెగులర్ 2డీ ఫార్మాట్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సినిమాకు ముందు ధూమ్-3, గోల్డ్, 2.0 ఐ-మ్యాక్స్ ఫార్మాట్‌లోనే విడుదలయ్యాయి.

Related posts