telugu navyamedia
సినిమా వార్తలు

“సాహో” కోసం వెజిటేరియన్‌గా మారిన ప్రభాస్

Saaho

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలు కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాపై ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉండడంతో అభిమానులు తొలి రోజే ఈ సినిమాని వీక్షించేందుకు పోటీలు ప‌డుతున్నారు. ఆగష్టు 18న ‘సాహో’ గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌ రామోజీ ఫిలింసిటీలో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్రభాస్, రాజ‌మౌళి, వివి వినాయ‌క్, అల్లు అరవింద్, శ్ర‌ద్ధా క‌పూర్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఈ సినిమాకు ముందు ప్రభాస్ “బాహుబలి” సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ పాపులారిటీని సంపాదించుకున్నారు. అందులో బాహుబలి పాత్ర కోసం బరువు పెరిగి లావుగా కనపడిన ప్రభాస్.. “సాహో”లో యాక్షన్ సీక్వెన్స్ చేయాలంటే కాస్త సన్నబడాలని యూనిట్ సూచించడంతో… బరువు తగ్గడానికి ప్రభాస్ పూర్తిగా వెజిటేరియన్ ఆహారాన్ని ఐదు నెలల పాటు తీసుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Related posts