telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆదిపురుష్ కోసం ప్రభాస్ కష్టాలు…

Prabhas

ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆదిపురుష్’ షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు. ఆదిపురుష్ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతుందని, అందులో ప్రభాస్ రాముడి పాత్ర చేయనున్నాడని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఇప్పటి వరకు వచ్చిన రాముడిలా కాకుండా విభిన్నంగా ప్రభాస్ కానరానున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాను 2022 ఆగస్టులో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఆదిపురుష్‌‌లో తన గెటప్ కోసం ప్రభాస్ ఐరు వారాల సమయం కేటాయించాడట. ఇందులో ప్రభాస్ ఫిజిక్ ఢిఫరెంట్‌గా ఉండనుందని, దాని కోసం ప్రభాస్ కాస్త సన్నబడనున్నాడని సమాచారం. ఈ ఐదువారాల్లో ఎక్కువ సమయంలో జిమ్‌లోనే కాకుండా మళ్లీ విల్లును ధరించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విలు విద్యను నేర్యుకునేందుకు అత్యుత్తమ నైపుణ్యం ఉన్న శిక్షకుడి దగ్గర శిక్సణ తీసుకోనున్నాడు. ఇదిలా ఉంటే రాధే శ్యామ్ షూటింగ్ డిసెంబరు రెండు, మూడు వారాల్లో ముగవనుంది. ఆ వెంటనే ప్రభాస్ ఆదిపురుష్ కోసం సన్నద్దం కానున్నాడు. అంతేకాకుండా ఆదిపురుష్‌తో పాటుగా నాగ్‌ అశ్విన్‌తో చేయనున్న సినిమా కూడా మొదలు అయ్యే అవకాశం ఉంది.

Related posts