telugu navyamedia
సినిమా వార్తలు

“సాహో” క్లోజింగ్ కలెక్షన్స్

Saaho

ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్‌ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు 350 కోట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు. శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. మొదటి రోజే ఈ సినిమా ఓవరాల్‌గా రూ.138 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా.. ప్రభాస్ స్టార్ ఇమేజ్‌తో ఈ సినిమాకు కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. ఈ క్రమంలో నాలుగు వారాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే.. సాహో నాలుగు వారాలకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా రూ.30 కోట్ల షేర్ రాబట్టింది. సీడెడ్‌లో రూ.12 కోట్ల షేర్..ఉత్తరాంధ్రలో సుమారు రూ.11 కోట్ల షేర్ కలెక్ట్ చేసినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రాలో తూర్పు గోదావరి జిల్లాలో రూ.7.5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 కోట్లు, గుంటూరులో రూ.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అలాగే కృష్ణా జిల్లాలో రూ.5.5 కోట్లు, నెల్లూరులో రూ.4.5 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.84 కోట్ల షేర్ సాధించినట్టు సమాచారం. సౌత్‌లోకర్ణాటకలో ఈ సినిమా రూ.16.5 కోట్లు కొల్లగొట్టింది. తమిళ వెర్షన్‌లో రూ.5.50 కోట్లు, మలయాళంలో రూ.1.50 కోట్లు సాధించింది. దక్షిణాదిలో ఈ సినిమా రిలీజ్ చేసిన వారికి భారీగా నష్టాలు మిగిల్చింది. ‘సాహో’ చిత్రానికి నార్త్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మొత్తంగా అక్కడ రూ. 157 కోట్లు తెచ్చిపెట్టింది. ఓవర్సీస్ విషయానికొస్తే..అమెరికాలో రూ.14 కోట్లు, మిగతా దేశాల్లోరూ.18 కోట్లు వసూలు చేసి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.270 కోట్లకు అమ్మినా ఈ సినిమా మొత్తంగా రూ.220 కోట్ల షేర్ రాబట్టింది. గ్రాస్ మాత్రం రూ.420 కోట్లకు పైగా రాబట్టింది. మొత్తంగా అన్ని ప్రాంతాలకు కలిసి డిస్ట్రిబ్యూటర్స్‌కు రూ.50 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. తెలుగులో మాత్రం 120 కోట్ల బిజినెస్ చేస్తే.. 80 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. హిందీలో రూ.100 కోట్ల బిజినెస్ చేస్తే.. రూ.150 కోట్లకు వసూళ్లు రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే.. సాహో ఒక్క బాలీవుడ్‌లో మాత్రమే సూపర్ హిట్ అయినట్టన్నమాట.

Related posts