telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక సినిమా వార్తలు

‘సాహో’ తరువాత ప్రభాస్ పెళ్లి: కృష్ణంరాజు

Krishnam Raju Says Election contest

రెబల్ స్టార్ కృష్ణంరాజు నటుడు ప్రభాస్ వివాహం గురించి స్పందించారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భాంగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రభాస్ పెళ్లి గురించి కృష్ణంరాజు ప్రస్తావించారు. తనను ప్రభాస్ వివాహం గురించి చాలా మంది అడుగుతున్నారని, ‘సాహో’ సినిమా విడుదల కాగానే ఆ వేడుక ఉంటుందని కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ‘బాహుబలి’ తరువాత తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి పెరిగిందని అన్నారు. త్వరలోనే గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ తో లవ్ స్టోరీ నిర్మిస్తామని అన్నారు. అందులో తాను కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నానని చెప్పారు.

ఇటీవల తాను చూసిన సినిమాల్లో ‘మహానటి’ అద్భుతంగా వుందని తెలిపారు. తనకు ఎస్వీ రంగారావు బయోపిక్ ను చూడాలని ఉందని, ఆ పాత్రను ప్రకాశ్ రాజ్ పోషిస్తే బాగుంటుందని చెప్పారు. తాను 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నానని, అప్పట్లో హీరోల మధ్య ఎటువంటి సన్నిహిత సంబంధాలుండేవో ఇప్పుడు కూడా మహేశ్, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ ల మధ్య అటువంటి సంబంధాలే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజీపీ తరపున ప్రచారం నిర్వహించానని, ఆంధ్రాలో ఎన్నికలకు ఇంకా సమయం ఉందని అధిష్ఠానం అడిగితే వెళ్లి ప్రచారం చేస్తానని పేర్కొన్నారు.

Related posts