telugu navyamedia
telugu cinema news trending

ప్రభాస్ భూవివాదం : ఈనెల 31 వరకు విచారణ వాయిదా

Prabhas

సినీనటుడు ప్రభాస్ ఇంటిని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. రాయదుర్గంలోని పైగా గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా కోర్టులో ఉన్న కేసులు తొలగిపోవడంతో శేరిలింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించి సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో ప్రభాస్ ఇల్లు ఉండటంతో దాన్నీ సీజ్ చేశారు. దీంతో హైకోర్టుని సంప్రదించాడు ప్రభాస్. తనకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా… సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా చూపించి తన స్థలాన్ని బలవంతంగా ఖాళీ చేయించడానికి అధికారులు ప్రయత్నించినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. అధికారుల చర్యలు తన హక్కులను హరించే విధంగా ఉన్నాయని, వారిని నియంత్రించాలని ప్రభాస్ కోర్టుని కోరారు.

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ భూవివాదం కేసులో తెలంగాణా రెవెన్యూ శాఖ అధికారులు సోమవారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం వద్ద ప్రభాస్ కు చెందిన స్థలాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందో తమ కౌంటర్ లో అధికారులు వివరించారు. ఈ కౌంటర్ ని స్వీకరించిన హైకోర్టు ఈ కేసులో తదుపరి విచారణని ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.

Related posts

జైషే సంస్థలపై చర్యలు తీసుకున్న.. పాక్; ఐరాస తీర్మానంతో.. తప్పక..!

vimala p

ఏ దేశం ఆదాయం ఎంత .. భారత్ 7వ స్థానంలో..

vimala p

షాంఘై ఫిల్మ్ ఫెస్టివల్ లో “మహానటి”

vimala p