telugu navyamedia
crime news Telangana telugu cinema news trending

ప్రభాస్ ఇల్లు సీజ్…

Prabhas

సినీనటుడు ప్రభాస్ ఇంటిని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. రాయదుర్గంలోని పైగా గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా కోర్టులో ఉన్న కేసులు తొలగిపోవడంతో శేరిలింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించి సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో ప్రభాస్ ఇల్లు ఉండటంతో దాన్నీ సీజ్ చేశారు. ఈ భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందుతుందని మాల రాములు, నీరుడు లక్ష్మయ్య కోర్టును ఆశ్రయించారు. వీరి నుంచి కొంత భూమి కొనుగోలు చేసిన శివరామకృష్ణ అనే వ్యక్తి కూడా కోర్టుకు వెళ్లారు.

వీరి వాదనలు విన్న న్యాయస్థానం బాధితులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. భూమిని ఫిర్యాదుదారులపై పట్టా చేయాలని అధికారులను ఆదేశించింది. కానీ అప్పటి తహసీల్దార్ పట్టా చేయకపోవడంతో శివరామకృష్ణ మళ్లీ కోర్టును ఆశ్రయించాడు. దీంతో తాసీల్దార్కు కోర్టు ధిక్కారణ శిక్ష విధించింది. ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చిన కోర్టు కేసు కొట్టేసింది. కాగా, నిర్మాణాలు ఎలా తొలగిస్తారని అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.

Related posts

వాలంటైన్స్ డే స్పెష‌ల్ గా కుట్రపూరితమైన ప్రేమ‌క‌థ‌ను చూపించ‌బోతున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్” ట్రైల‌ర్…

vimala p

కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు:  కేటీఆర్‌

ashok

మోడీ విజయాన్ని పకోడీలతో సెలెబ్రేట్ చేసుకున్న కంగనా

vimala p