telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాజల్, అనుష్కలపై రెబల్ స్టార్ కామెంట్స్

PRabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెష‌ల్ డ్యాన్స్‌తో అల‌రించ‌నుంది. బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలవుతుండడంతో అన్ని ప్రాంతాల్లోనూ ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రభాస్ తనతో కలిసి నటించిన హీరోయిన్లు అనుష్క, కాజల్‌ల ప్లస్‌లు, మైనస్‌ల గురించి ఆసక్తికరంగా మాట్లాడాడు. ప్రభాస్, కాజల్ కలిసి “డార్లింగ్”, “మిస్టర్ పెర్‌ఫెక్ట్” చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. కాజల్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. “కాజల్ చాలా అందంగా ఉంటుంది. ఎనర్జిటిక్‌గా ఉత్సాహంతో ఉంటుంది. అయితే అప్పట్లో ఆమె డ్రెస్సింగ్ సెన్స్ నాకు నచ్చేది కాదు. ఆమెకు డ్రెస్సింగ్ సెన్స్ తక్కువని అనిపించేది. అయితే ఇప్పుడు ఆమె మారింది. డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో చాలా మారింది” అని ప్రభాస్ చెప్పాడు. ఇక తనతో కలిసి “బిల్లా”, “మిర్చి”, “బాహుబలి” సినిమాల్లో నటించిన అనుష్క గురించి మాట్లాడుతూ… “అనుష్క చాలా అందంగా, చాలా పొడవుగా ఉంటుంది. ఆమె హైట్ రియల్లీ గ్రేట్. లేడీ సూపర్ స్టార్… ఆమెలో నచ్చని విషయం అంటే… ఆమె ఫోన్ కాల్స్‌కు సరిగ్గా రెస్పాండ్ అవ్వదు. కనీసం నేను చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదు” అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్.

Related posts