telugu navyamedia
telugu cinema news trending

ఇటలీలో బర్త్డే వేడుకలు చేసుకున్న ప్రభాస్‌

ప్రముఖ సినీ హీరో ప్రభాస్‌ పుట్టిన రోజు వేడుకలు ఇటలీలో ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌’ చిత్రం షూటింగ్‌లో భాగంగా ఇటలీలో ఉన్న ‘బాహుబలి’ అక్కడే చిత్ర బృందంతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సెట్స్‌లోనే కేకు కోసి సందడి చేశారు. పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు డార్లింగ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల నుంచి సర్‌ప్రైజ్‌ చేస్తూ ‘రాధేశ్యామ్‌’ చిత్ర బృందం తొలి‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’ పేరుతో విడుదలైన ఈ పోస్టర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కి జంటగా పూజా హెగ్డే సందడి చేయనున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలనాటి నటి భాగ్యశ్రీ, మురళీ శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.

Related posts

విజయ్ సేతుపతి “రేడియో మాధవ్” ట్రైలర్

vimala p

మమతతో .. చంద్రబాబు భేటీ ..

vimala p

భారీ ప్రాజెక్ట్ ను వదులుకున్న రష్మిక… ఆ పాత్రకు తాను న్యాయం చేయలేదంట…!?

vimala p