telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫ్యాన్స్‌ అదిరిపోయే గిఫ్ట్‌ ఇవ్వనున్న రెబల్‌ స్టార్‌ !

ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘రాధే శ్యామ్’. ఈ చిత్రానికి ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తున్నారు. భాగ్యశ్రీ, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, సత్యన్, శాషా ఛేత్రి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్ అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడట. అతి త్వరలో రాధేశ్యామ్ నుంచి అందరికీ ఓ గిఫ్ట్ రానుందట. అయితే ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకోవడంతో ప్రభాస్ మొత్తం టీమ్‌కి ఖరీదైన వాచ్‌లు బహూకరించాడు. ఇదే క్రమంలో అభిమానులకు కూడా ఓ మంచి గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట. అతి త్వరలో ఈ సినిమా నుంచి ఓ క్యూట్ గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ గ్లింప్స్‌తో అందరినీ ఆకట్టుకోనున్నారు. అంతేకాకుండా ఇందులో హీరో, హీరోయిన్‌లు ఇద్దరు కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ లుక్స్‌ ఎలా ఉంటాయా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సారైనా వీరు చెప్పిన విధంగా గ్లింప్స్‌ విడుదల చేస్తారా, ఇప్పటికే టీజర్ వస్తుందని చెప్పినా విడుదల కాలేదని కొందరు అంటున్నారు. మరి ఈ సారి ప్రభాస్ తన అభిమానులను ఎంతవరకు మెప్పిస్తాడో. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓ పీరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతోంది. దీనిని జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. మరి ప్రభాస్ వారి అంచనాలను అందుకుంటాడా అనేది చూడాలి.

Related posts