telugu navyamedia
andhra crime news political

సీఎం ఇంటివద్ద ఉద్రిక్తత..టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం!

Prabhakar chowdaryTDP balija demands

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నివాసం వద్ద పెట్రోల్ పోసుకుని ఓ టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సీఎం నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి సీటిస్తే టీడీపీలో ఉన్న బలిజ నాయకులందరూ మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధమని రాయలసీమ బలిజ మహా సంఘం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో బుధవారం ప్రభాకర్‌ చౌదరికి వ్యతిరేకంగా బలిజలు సీఎం ఇంటి వద్ద నిరసన చేపట్టారు.

ప్రభాకర్ చౌదరి స్థానంలో బలిజలకు సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ చౌదరి బలిజలని అణచివేస్తున్నాడని వారు ఆరోపించారు. ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఓ టీడీపీ కార్యకర్త ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Related posts

అల్లు అర్జున్ చిత్రానికి.. నిర్మాతగా మహేష్ బాబు..

vimala p

హుజూర్‌ నగర్ పై కేసీఆర్ వరాల వాన

vimala p

73వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు : .. దేశవ్యాప్తంగా సందర్శకులకు అనుమతి రద్దు.. పలుచోట్ల నిషేదాజ్ఞలు..

vimala p