telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప‌వర్ స్టార్ … డ్యుయ‌ల్ రోల్

pavan

‘వకీల్‌సాబ్‌’తో వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆ మూవీ త‌ర్వాత‌ క్రిష్‌ దర్శకత్వంలో చారిత్రక నేప‌థ్యం ఉన్న‌ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ ప‌వర్ స్టార్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నాడంటూ ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి.పవన్ తన ఫిల్మ్ జ‌ర్నీలో ఇప్పటి వరకు ద్విపాత్రాభినయం చేయలేదు. అందుకే ఈ న్యూస్ అభిమానుల్లో మ‌రింత ఆస‌క్తి పెంచింది. దీనిపై మ‌రికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. హీరోయిన్​ వివరాలను ఇప్పటివరకు రివీల్ చెయ్య‌లేదు యూనిట్. కాగా ఎం.ఎం.కీరవాణి ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Related posts