telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వర్మకు హ్యాండిచ్చిన “పవర్ స్టార్”

RGV

‘పవర్ స్టార్’ పేరుతో సినిమా తీస్తున్నట్లు వర్మ ప్రకటన చేయగానే సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ లైఫ్ ఆధారంగా ఈ మూవీ చేస్తున్నారంటూ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాదు ఇందులో నటించబోయే నటుడు, ఇతనే పవర్ స్టార్ అంటూ ఓ వ్యక్తిని చూపిస్తూ ఆయన విడుదల చేసిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో కనిపించిన వ్యక్తి అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఉండటం మరింత ఆసక్తి రేకెత్తించింది. దీంతో ఆ వ్యక్తి ఎవరనే దానిపై ఆరాదీసిన మీడియా వర్గాలు.. ఆయన భద్రాచలంకు సమీపంలోని సారపాక గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా సమాచారం ప్రకారం ఆ వ్యక్తి ‘పవర్ స్టార్’ సినిమాలో నటించేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. అతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టే ఈ మూవీ నుంచి తప్పుకున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో వర్మకు ఊహించని షాక్ తగిలిందని, ఆయన ఈ ప్రాజెక్టును నిలిపి వేస్తున్నారనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. సో.. చూడాలి మరి దీనిపై వర్మ ఎలా స్పందిస్తారనేది. 

Related posts