telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

అందాన్నిచ్చే .. బంగాళా దుంపలు …

potatoes for beauty

ఇప్పటివరకు బంగాళాదుంపలు తినడానికే పనికివస్తుంది అనుకున్నాం..కానీ అందానికి పనికివస్తుంది. బంగాళా దుంపతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు, ఇన్నాళ్లు ఈ బంగాళా దుంపలు కేవలం వంటకు అని అనుకుంటే ఇప్పుడు అందానికి కూడా ఉపయోగ పడుతాయి అని తెలుస్తుంది. ఇప్పుడు బంగాళా దుంపతో అందాన్ని ఎలా పెంచుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.

* పచ్చిగా ఉన్న బంగాళా దుంప గుజ్జును గ్లాసు నీళ్ళలో వేసి కలిపి మరిగించాలి. నీరు పూర్తిగా ఆవిరై పోగా మిగిలిన గుజ్జును వారానికి రెండుసార్లు ముఖానికి రాసుకుంటే చర్మం మీద పడిన మచ్చలు తొలగిపోతాయి.

* పచ్చి బంగాళా దుంప రసం తీసి చర్మానికి రాసుకున్నా చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.

* ఉడికించిన రెండు బంగాళ దుంపల గుజ్జుకు రెండు చెంచాల పాలు కలిపి మిక్సీలో వేసి గుజ్జుగా చేసి గోరువెచ్చగా వుండగానే ముఖానికి పట్టించాలి. అరగంట పాటు ముఖాన్ని ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగి, తేలిగ్గా పాల మీగడ రాసి పది నిమిషాల తర్వాత మరోమారు కడిగితే ముఖం కాంతిలీనుతుంది.

* ఉడకబెట్టిన బంగాళాదుంప గుజ్జును రోజూ రాత్రిపూట పడుకోబోయే సమయంలో ముఖానికి రాసి ఉదయాన్నే కడిగితే చర్మం మీది తెగిన, కాలిన గాయాలు, మొటిమలు మటుమాయం అవుతాయి.

Related posts