telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

తగ్గిన ఉల్లి ఘాటు..పెరిగిన ఆలూ రేటు

potato rate hike

మొన్నటివరకు చుక్కలనంటిన ఉల్లి ధర కొత్త పంట అందుబాటులోకి వస్తుండడంతో ఉల్లి ఘాటు తగ్గింది. కానీ, పండగ ముందు బంగాళా దుంపలు (ఆలూ) ధర కూడా ఉల్లి మాదిరిగా పెరగవచ్చని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఆలూ కిలో రూ.40 పలుకుతోంది. దేశంలోని మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బంగాళా దుంపల సాగు అధికంగా ఉంటుంది. ఖరీఫ్, రబీ పంటగా పండిస్తారు.

అక్టోబర్, నవంబర్ లో వేసే పంట డిసెంబరు, జనవరి నాటికి అందుబాటులోకి వస్తుంది. పంట అం దుబాటులోకి వచ్చినా ధర ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు బంగాళా దుంపల దిగుమతులు తగ్గిపోయాయి. దీని ప్రభావంతో గడచిన వారం రోజుల్లో బంగాళా దుంపల ధర రెట్టింపు అయింది. పరిస్థితి ఇలాగే ఉంటే ఇంకా ధర పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

Related posts