telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

హైబీపీ కి .. పొటాషియం కలిగిన ఈ ఆహారం తో చెక్.. !

potassium food helps to overcome high bp

ఒత్తిడితో కూడిన జీవన విధానంతో చాలా మందికి అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. ఈ బీపీ ఎక్కువ‌గా ఉండ‌డంతో కొంద‌రికి గుండె జ‌బ్బులు కూడా వ‌స్తున్నాయి. అయితే ఎవ‌రికైనా హైబీపీ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ హైబీపీ ఎలా వ‌చ్చినా స‌రే.. దాన్ని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌డం తప్ప‌నిస‌రి. ఈ క్ర‌మంలోనే పొటాషియం అధికంగా ఉండే ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని, అలాగే హైబీపీ కూడా త‌గ్గుతుంద‌ని న్యూట్రిష‌నిస్టులు చెబుతున్నారు. మ‌రి పొటాషియం ఏయే ఆహారాల్లో ఎక్కువ‌గా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామా..!

* అర‌టి పండ్ల‌లో పొటాషియం ఎక్కువ‌గా ఉంటుంది. ఒక సాధార‌ణ సైజులో ఉన్న అర‌టి పండును తింటే మ‌న‌కు 500 మిల్లీగ్రాముల పొటాషియం అందుతుంది. అర‌టి పండ్ల‌ను నేరుగా తిన‌వ‌చ్చు. లేదా బ‌నానా షేక్‌, ఓట్‌మీల్ లాంటివి చేసుకుని తిన‌వ‌చ్చు. ఎలా తిన్న‌ప్ప‌టికీ అర‌టి పండ్ల ద్వారా ల‌భించే పొటాషియంతో హైబీపీ అదుపులో ఉంటుంది.

* డ్రై యాప్రికాట్స్‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పొటాషియం స్థాయిలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. దీని వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. వీటితో స్మూతీల‌ను చేసుకుని కూడా తీసుకోవ‌చ్చు.

* చేప‌ల్లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ప్రోటీన్ల‌తోపాటు పొటాషియం కూడా పుష్క‌లంగానే ఉంటుంది. అలాగే విట‌మిన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా చేప‌ల్లో ఉంటాయి. 170 గ్రాముల బ‌రువున్న ఒక చేప ముక్క‌ను తింటే మ‌న‌కు 650 మిల్లీగ్రాముల పొటాషియం ల‌భిస్తుంది. దీని వ‌ల్ల హైబీపీని అదుపులో ఉంచుకోవ‌చ్చు.

* డార్క్ గ్రీన్ క‌లర్‌లో ఉండే బ్రొకొలిని తీసుకోవ‌డం వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. ఇందులో విట‌మిన్ సి, కె, ఫోలేట్‌, ఫైబ‌ర్‌, పొటాషియంలు పుష్క‌లంగా ఉంటాయి. దీంతోపాటు బ్రొకొలిని తిన‌డం వ‌ల్ల త‌క్కువ క్యాల‌రీలు అందుతాయి. ఫ‌లితంగా బ‌రువు కూడా నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

* వీటిల్లోనూ పొటాషియం పుష్క‌లంగా ఉంటుంది. ఇది శ‌రీర మెట‌బాలిజాన్ని పెంచుతుంది. హైబీపీని త‌గ్గిస్తుంది. ఒక అవ‌కాడో తింటే మ‌న‌కు సుమారుగా 1067 మిల్లీగ్రాముల పొటాషియం ల‌భిస్తుంది.

* హైబీపీ ఉన్న‌వారికి కొబ్బ‌రి నీళ్లు మంచి ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. బీపీ పెరిగితే కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే చాలు, వెంట‌నే బీపీ అదుపులోకి వ‌స్తుంది. శ‌రీరాన్ని కొబ్బ‌రి నీళ్లు హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. అలాగే అధిక బ‌రువు త‌గ్గించేందుకు స‌హాయ ప‌డ‌తాయి.

* పాల‌కూర‌లోనూ పొటాషియం స‌మృద్ధిగా ల‌భిస్తుంది. త‌రచూ పాల‌కూర‌ను ఆహారంలో భాగం చేసుకుంటే హైబీపీని త‌గ్గించుకోవ‌చ్చు.

Related posts