telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

జమ్మూకశ్మీర్‌లో పోస్టు పెయిడ్‌ మొబైల్‌ సేవలు

18 soldier died in jammu kashmir bomb blast

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో మొబైల్‌ సేవలను కూడా అధికారులు నిలిపివేశారు. మొబైల్‌ ఆంక్షలు తొలగించడంతో జమ్మూకశ్మీర్‌లో పోస్టు పెయిడ్‌ మొబైల్‌ సేవలు సోమవారం ఉదయం అందుబాటులోకి వచ్చాయి. దీంతో 72 రోజుల తర్వాత పోస్టు పెయిడ్‌ మొబైల్‌ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో ఇంటర్నెట్‌ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

మొత్తంగా 40 లక్షల పోస్టు పెయిడ్‌ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం పరిస్థితుల అదుపునకు ప్రభుత్వం మొబైల్‌ సేవలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వాస్తవానికి పోస్ట్‌ పేయిడ్‌ మొబైల్‌ సేవలు అక్టోబర్ 12వ తేదీ నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా సాంకేతిక సమస్యల కారణంగా కాస్త ఆలస్యమైంది.

Related posts