• Home
  • వార్తలు
  • పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ” క్రేజీ కేజీ ఫీలింగ్ “
వార్తలు సినిమా వార్తలు

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ” క్రేజీ కేజీ ఫీలింగ్ “

Crazy Crazy Feeling
విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం  ” క్రేజీ క్రేజీ ఫీలింగ్ “. సంజయ్ కార్తీక్ దర్శకుడు.  విష్వoత్, పల్లక్ లల్వాని జంటగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. 
 
ఈ సందర్బంగా దర్శకుడు సంజయ్ మాట్లాడుతూ .. కేరింత, మనమంతా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్వoత్ హీరోగా, పల్లక్ లల్వాని హీరోయిన్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రేమికుల మధ్య వుండే ఫీలింగ్స్ ని వినోదాత్మకంగా చూపిస్తున్నాం. వెన్నెల కిశోర్ పాత్ర ఆకట్టుకుంటుంది. 
Crazy Crazy Feeling
నిర్మాత మధు మాట్లాడుతూ .. ప్రేమ, ఫీల్, వినోదం ఈ మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు సంజయ్ యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్  గా క్రేజీ క్రేజీ ఫీలింగ్ ని రూపొందిస్తున్నారు. ప్రసాద్ లాబ్స్, రామానాయుడు స్టూడియోల్లో నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. విడుదలయ్యేంత వరకే చిన్న సినిమా, విజయం సాధించి పెద్ద సినిమా అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 
 
విష్వoత్, పల్లక్ లల్వాని, వెన్నెల కిశోర్, ఫిదా ఫేమ్ శరణ్య, సుమన్, పోసాని తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో, సాహిత్యం సురేష్ ఉపాధ్యాయ, కాసర్ల శ్యామ్, కెమెరా సుభాష్ దొంతి, ఆర్ట్ నాగు, కొరియోగ్రఫీ రాజకిరణ్, చార్లీ. 

Related posts

శరవేగంగా 'భరత్ అను నేను'

admin

కెప్టెన్‌ని ఎదిరించి మరీ నూతన్ కి సహాయం చేసిన కౌశల్

jithu j

తెలంగాణ ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ – ఉత్తమ ఉపాద్యాయ పురస్కారాలు

chandra sekkhar

Leave a Comment