telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ విద్యా వార్తలు

ఈ దేశానికి ఏమైంది..!, ..పీజీ చదివినవాడు డెలివరీ బాయా..

post graduate as food delivary boy

పసలేని చదువులు, విద్యాలయాలు.. విశ్వవిద్యాలయాలు. పేరుకే ఉన్నాయి, కాగితాల సర్టిఫికెట్లు తప్ప, జీవితంపై భరోసా నింపలేనివే అవన్నీ. విద్యలేని వాడు వింతపసువు అని నాటి మాట; చదువుకున్న వాడి కంటే చాకలోడే మేలు అనేది నేటికి సరిగ్గా సరిపోయే మాట. ఎన్నో ఆశలతో విద్యాలయాలకు వెళ్తున్నవారికి పాస్ అయ్యావని కాగితాలు చేతిలో పెట్టి పంపిస్తున్నారు తప్ప, బ్రతికే దారి లేకుండా చేస్తున్నారు. దానితో వారివారి పరిస్థితులను బట్టి ఏదో ఒక పని చేసుకుంటున్నారు కొందరు; మరికొందరు చదువుకున్నాం కదా అని ఏదో ఒక పని చేయలేక .. నిరుద్యోగ ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది అందరికి తెలిసిందే. ఇదిగో ఇతగాడు కొత్తగా దేశానికి వచ్చినట్టున్నాడు. ఏమంటున్నాడో చూడండి .. మరి అమాయకంగా అంటున్నాడు.. అదేదో యాడ్ లో అన్నట్టుగా..

“ఈ దేశానికి ఏమైంది? నా జీవితంలో ఇలాంటి సంఘటన జరుగుతుందని అనుకోలేదు” అంటూ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి షౌవిక్ దత్తా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండియాలో చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవని అతను చేసిన వ్యాఖ్యలపై యువత స్పందిస్తోంది. కలకత్తా కు చెందిన షౌవిక్ దత్తా, జొమాటో యాప్ లో తనకు కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్ చేయగా, ఫుడ్ డెలివరీ చేసేందుకు మెరాజ్ అనే యువకుడు వచ్చాడు. అతనితో మాటలు కలిపిన షౌవిక్, ఎంకామ్ చదివి, ఆపై ఆర్థిక శాస్త్రంలో పీజీడీఎం చేసిన వ్యక్తి, ఉద్యోగం లేక ఇలా డెలివరీ చేస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఉద్యోగం లేక ఈ పని చేస్తున్నాడట. చాలా విచారకరం. ఈ దేశానికి ఏమైంది. ఈ రాష్ట్రానికి ఏమైంది? ఎంకామ్‌ చదివిన వ్యక్తి గ్రాడ్యుయేషన్ కూడా పూర్తిచేయని నాకు ఆహారాన్ని డెలివరీ చేస్తున్నారు. ఈ ఘటన ఏ సందేశాన్ని ఇస్తోంది? ఈ దేశం మారాలి. ఈ రాష్ట్రం మారాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలను సృష్టించాలి. మనం దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం” అని తనకు ఎదురైన అనుభవంపై షౌవిక్ విచారాన్ని వ్యక్తం చేశాడు.

Related posts