telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

చైనాను మరోసారి హెచ్చరిస్తున్నా శాస్త్రవేత్తలు…

china flag

చైనావైరస్ అయిన కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.  వ్యాక్సిన్ కోసం చైనా ప్రయత్నాలు చేస్తున్నది.  ప్రపంచంలో కరోనా మహమ్మారి వ్యాపించడానికి చైనానే కారణం అని ఇప్పటికే ప్రపంచదేశాలు ఆరోపిస్తున్నాయి.  ఇక ఇదిలా ఉంటె, చైనా ఇప్పుడు మరో సంక్షోభాన్ని ఎదుర్కొనబోతున్నది. రెండు దశాబ్దాల క్రితం చైనా ఓ పాలసీని తీసుకొచ్చింది.  సింగిల్ కిడ్ పేరుతో పాలసీని తీసుకొచ్చి కఠినంగా అమలు చేసింది.  ప్రజలు కూడా దానికే అలవాటు పడ్డారు.  అయితే, 2016లో ఆ పాలసీని చైనా ప్రభుత్వం విరమించుకుంది.  ఒక్క బిడ్డ పాలసీని అమలు చేస్తే భవిష్యత్తులో చైనా మ్యాన్ పవర్ సమస్యను ఎదుర్కొంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  ఒక్కరి కంటే ఎక్కువ మందిని కనాలని చైనా అధికారులు ప్రజలను కోరుతున్నారు.  కానీ, చైనా ప్రజలు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.  మారుతున్న జీవనం, ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ప్రజలు పిల్లలపై దృష్టి పెట్టలేకపోతున్నారు.  పునరుత్పత్తి శాతం 2.1 గా ఉండాలి.  కానీ అది 1.5 కంటే దిగువుగా ఉండటంతో శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.  చూడాలి మరి ఎం జరుగుతుంది అనేది.

Related posts