telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పూనమ్ పాండే, ఆమె భర్త ‌‌కు బెయిల్… అరెస్ట్ అయిన గంటల్లోనే… !

Poonam-Pandey

బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండేకు అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే బెయిల్ లభించింది. పూనమ్ ను గోవా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గోవాలోని చపోలీ డ్యామ్ వద్ద పూనమ్‌ అసభ్య వీడియోను చిత్రీకరిస్తుండగా గుర్తించిన పోలీసులు.. వీడియో తీస్తున్న వ్యక్తితో పాటు పూనమ్ పాండేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గోవా ప్రభుత్వ జల వనరుల శాఖ యాజమాన్యంలోని ఉన్న స్థలంలో పూనమ్ పాండే అశ్లీల ఫోటోలు, వీడియోలు షూట్ చేస్తోందని ఫిర్యాదు రావడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు గోవా పోలీసులు. ఉత్తర గోవాలోని సింక్వెరిన్ అనే ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉన్న పూనమ్ పాండేను అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి నేరుగా ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆమెపై నమోదైన కేసు విషయమై ప్రశ్నించేందుకు గాను పూనమ్ పాండేను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. కాగా అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే పూనమ్ పాండే, ఆమె భర్త శామ్ బొంబాయ్‌‌కు బెయిల్ మంజూరు కావడం విశేషం. 20వేల రూపాయల పూచీకత్తుతో వీరికి బెయిల్ ఇచ్చారు. కోర్టు పర్మిషన్ లేకుండా గోవాను విడిచి వెళ్లొద్దని, ఆరు రోజుల పాటు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి రిపోర్ట్ చేయాలని సూచించారు.

Related posts