telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ నెల 16న నిర్భయకు న్యాయం జరగబోతోంది… : పూనమ్ కౌర్

Nirbhaya

హైదరాబాద్ లో దిశ హత్యకేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు నిర్భయ కేసు నిందితుల రివ్యూ పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టివేసిందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నెల 16న వారిని ఉరి తీయనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో పూనమ్ నిర్భయ తల్లిని కలిశారు. ఆమెతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “నిర్భయ నిందితులకు ఉరిశిక్ష పడుతుందని తెలిసి మన దేశం ఎంతో సంతోషిస్తుంది. ఈ నెల 16న నిర్భయకు న్యాయం జరగబోతోంది. చాలా కాలం పాటు ఎదురు చూశాం. దోషులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. నిర్భయ చేతన దివస్‌ రోజునే నిందితులను ఉరి తీయబోతున్నారు. ఈ నెల 16న యావత్ భారతదేశం ఎంతో సంతోషంగా ఉంటుంది. మన ప్రియమైన నిర్భయకు న్యాయం జరగబోతోంది. డిసెంబర్ 16 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా” అని పేర్కొన్నారు. 2012లో దిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. తన స్నేహితుడితో కలిసి బస్సులో వెళుతున్న ‘నిర్భయ’ను ఐదుగురు వ్యక్తులు దారుణంగా రేప్ చేశారు. దాంతో దాదాపు 15 రోజుల పాటు చావు బతుకుల మధ్యకొట్టుమిట్టాడిన బాధితురాలు ప్రాణాలు విడిచింది. దాంతో ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Related posts