telugu navyamedia
సినిమా వార్తలు

వీడియోలతో వేధిస్తున్నారు… పోలీసులకు పూనమ్ కౌర్ ఫిర్యాదు

Poonam-Kaur

సినీనటి పూనమ్ కౌర్ పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు వీడియోలు ప్రచారం అవుతున్నాయి. పూనమ్ కు పవన్ కళ్యాణ్ తో ఎఫైర్ ఉందనే వార్తలు గతంలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆమెపై పలు యూట్యూబ్ చానెళ్ళు పలు రకాల వార్తలను ప్రచారం చేస్తున్న విషయం ఆమె దాకా వెళ్లడంతో పూనమ్ పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేసింది. యూట్యూబ్‌ ఛానళ్లలో తనపై అసభ్యకర పోస్టులు, వీడియోలు పోస్ట్ చేస్తూ, తనను మానసికంగా వేధిస్తున్నారని సినీ నటి పూనమ్ కౌర్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారుపూనమ్ . సుమారు 50 యూట్యూబ్ ఛానళ్లపై ఆమె ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను పూనమ్ కోరారు. తనపై ఉద్దేశపూర్వకంగానే కొంతమంది వ్యక్తులు అసభ్యకర పోస్టులు పోస్టింగ్ చేస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు.

Related posts