telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్‌పై ‘గుండు’ కామెంట్స్ చేసిన రోజా… లైక్ కొట్టిన పూనమ్ కౌర్

Damodar

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ తాజాగా కొట్టిన ఓ లైక్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా… జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ పవన్ కళ్యాణ్‌కి టీడీపీ వాళ్లు (పరిటాల) గుండు కొట్టించింది నిజం… మళ్లీ 2014లో ప్రజలు కొట్టించారు. 2019లో మొత్తం బోడుగుండు కొట్టించారు అంటూ రాజకీయ విమర్శలు చేశారు. అయితే రోజా పవన్‌పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వీడియోపై స్పందిస్తూ పూనమ్ కౌర్ లైక్ కొట్టింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ తిడుతూ రోజా చేసిన గుండు కామెంట్స్‌కి పూనమ్ కౌర్ లైక్ కొట్టడం హాట్ టాపిక్ అవుతుంది. నిన్న మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్ పేరుని ప్రస్తావించకుండా ‘జల్సా.. అజ్ఞాతవాసం.. నమ్మకద్రోహి..’ అంటూ ఇన్ డైరెక్ట్‌గా కామెంట్స్ చేసినా.. ఈసారి మాత్రం డైరెక్ట్‌గానే ఆయనకు లైక్ కొట్టడం గమనార్హం.

Related posts