telugu navyamedia
సినిమా వార్తలు

కుర్ర హీరోయిన్ తో జోడి కడుతున్న నాగ్ ?

Nagarjuna

సరిగ్గా మూడేళ్ళ క్రితం సంక్రాంతికి నాగార్జున ప్రధానపాత్రలో వచ్చిన “సోగ్గాడే చిన్ని నాయనా” చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన “బంగార్రాజు” పాత్రలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో సోగ్గాడే చిన్నిం నాయనా చిత్రానికి సీక్వెల్ గా “బంగార్రాజు” చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున కథానాయకుడిగా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఇంతకుముందు ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికగా కాజల్ ను తీసుకోవాలనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా కాజల్ స్థానాల్లో పూజా హెగ్డే పేరు వినబడుతోంది. ఇటీవల కాలంలో పూజా హెగ్డే వరుస సినిమాల్లో నటిస్తూ మంచి హిట్స్ తో యూత్ లో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. అందువలన కాజల్ కి బదులుగా పూజా హెగ్డేను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇలా పూజా హెగ్డే మరో అవకాశాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో నాగార్జున “మన్మథుడు 2” చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత “బంగార్రాజు” చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో “బంగార్రాజు” మనవడి పాత్రలో చైతూ కనిపించనున్నాడు. ఆయన జోడీగా ఎవరిని తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

Related posts