telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ ప్రపోజ్ చేస్తే… పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్

Pooja

టాలీవుడ్‌లో అగ్ర కథానాయిక పూజా హెగ్డే దూసుకెళ్తోంది. వరుసగా పెద్ద సినిమాల ఆఫర్లతో పూజా హెగ్డే చాలా బిజీగానే ఉంది. ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత నుండి వాల్మీకి వరకూ అన్నీ క్రేజీ సినిమాలే. ఇప్పుడు అల్లు అర్జున్ తో కలిసి ఈ బ్యూటీ నటించిన “అల వైకుంఠపురంలో” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తరువాత ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామా జాన్‌లో నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది పూజ. మరోవైపు అఖిల్ తో కూడా నటిస్తోంది. హిట్స్, ఫ్లా్ప్స్‌తో సంబంధం లేకుండా అగ్ర కథానాయకులు అందరితో కలిసి నటించే అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు భారీ సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు పూజ. నెటిజన్స్ సోషల్ మీడియాలో అడిగిన ప్రశ్నలకు పూజ సమాధానం చెప్పాల్సి ఉంది. అయితే ఓ నెటిజన్‌ నుంచి పూజకు షాకింగ్ ప్రశ్న ఎదురైంది. ఒకవేళ ప్రభాస్ మీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? అని అడిగారు. దీనికి ఏమని సమాధానం చెప్పాలో తెలీక పూజ వెర్రి చూపులు చూస్తూ కూర్చుంది. ‘నో.. అయినా ఇవేం ప్రశ్నలు. ఒకవేళ ప్రపోజ్ చేస్తే అనే ప్రశ్నకు లాంగ్ స్టోరీ ఉంటుంది. నో నేనైతే దీనికి సమాధానం చెప్పలేను’ అంటూ సిగ్గుపడ్డారు.

Related posts