telugu navyamedia
telugu cinema news trending

ఆ హీరోతో చేయడమే నాకు నచ్చుతుంది…

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో పూజా హెగ్డే జోరు కొనసాగుతోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ, వరుస విజయాలను అందుకుంటున్న పూజ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కెరీర్ తొలినాళ్లలోనే ఈ ‘మొహెంజోదారో’ బ్యూటీ బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. అయితే అక్కడ పూజా ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో తెలుగులో గ్లామర్ గేట్లు ఎత్తేసి, స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. రీసెంట్ గా ‘అల వైకుంఠపురములో’ మెరిసి ఆకట్టుకుంది ఈ బుట్టబొమ్మ. అయితే పూజా హెగ్డే మళ్లీ రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.3కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’, అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌’ చిత్రాల్లో నటిస్తున్న పూజాకు ఇంకా అనేక ఆఫర్లు వరుస కడుతున్నాయి. అయితే.. తాజాగా పూజా ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించింది. అరవింద సమేత తనకు ఎప్పటికీ ప్రత్యేకమైన మూవీ అని పేర్కొంది. ఎన్టీఆర్‌ తో పనిచేయడం అద్భుతంగా అనిపించిందని.. ఇద్దరి ఎనర్జీ లెవల్స్‌ ఎక్కువ కావడంతో ఇద్దరి జోడీ తెరపై ఆకట్టుకుంటుందని పేర్కొంది. ఎన్నో అనుభవాలను ఇచ్చిందన్న పూజా… త్రివిక్రమ్‌ వల్ల ఈ సినిమాకి సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకున్నట్లు వెల్లడించింది.

Related posts

నేడే ఐపీఎల్ ఫైనల్ పోరు…

Vasishta Reddy

తెలుగుదేశం గూండాలు పేదలపై ట్రాక్టర్లు ఎక్కిస్తున్నారు

Vasishta Reddy

షర్మిల బహిరంగ సభకు వైఎస్ విజయమ్మ!

Vasishta Reddy