telugu navyamedia
news telugu cinema news

నాగ చైతన్య ‘థ్యాంక్యూ’ సినిమాలో హీరోయిన్ ఆమేనా…?

ఇప్పుడు తెలుగులో ఉన్న టాప్ హీరోలలో పూజా హెగ్డే ఒక్కరు. అయితే ఏడేళ్ల క్రితం 2014 లో ‘ఒక లైలా కోసం’ సినిమాలో నాగచైతన్యతో, పూజా హెగ్డే జత కట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. చైతన్య తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’ ఏప్రిల్ 16న జనం ముందుకు రాబోతోంది. అదే విధంగా అతని కొత్త సినిమా ‘థ్యాంక్యూ’ ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే ను ఒక నాయికగా ఎంపిక చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ యంగ్ హీరో అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ నటిస్తోంది పూజా హెగ్డే. అయితే గత ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో బన్నీతో సూపర్ హిట్ అబ్దుకున పూజా… ‘ఆచార్య’లో చరణ్ జతగా నటిస్తోంది. ఇక అంతేకాదు… అన్నీ అనుకున్నట్టు జరిగితే… అఖిల్ సినిమా తర్వాత నాగ చైతన్యతో మరోసారి ఈ భామ స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఉందట. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.

Related posts

ఓ ప్రేయసి..ఉండిపో..నిండిపో

Vasishta Reddy

బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆప్ రెబల్ నేత కపిల్ మిశ్రా

vimala p

ఏపీలో .. మళ్ళీ పాతతరహా గ్రామ పరిపాలనా వ్యవస్థ..

vimala p