telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా నియంత్రణలో కేసీఆర్ పూర్తిగా విఫలం: పొన్నం

ponnam prabakar resignation

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు సరిగా నిర్వహించడంలేదని ఆయన దుయ్యబాట్టారు. హైదరాబాదులో తప్ప జిల్లా కేంద్రాల్లో కరోనా టెస్టులు నిర్వహించడం లేదని అన్నారు. కరోనా సోకిన ప్రజాప్రతినిధులు గాంధీ ఆసుపత్రికి ఎందుకు వెళ్లడంలేదని పొన్నం ప్రశ్నించారు.

వెయ్యి కోట్లు ఖర్చయినా వెనుకాడకుండా కరోనా వైరస్ ను ఎదుర్కొంటామన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని నిలదీశారు. కరోనా నియంత్రణలో కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. పారాసిటమాల్, వేడి నీళ్లు, హరితహారంతో కరోనా నివారణ జరుగుతుందా అని ఎద్దేవా చేశారు.

Related posts