telugu navyamedia
Uncategorized తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

చీపురు పట్టిన పొన్నాల.. వంటగది శుభ్రం!

Ponnalala Laxmaiah congress

లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సొంత ప‌నిని సంతోషంగా చేస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుందని భావించిన కొందరు భర్తలు ఇంటి పనుల్లో భార్యకు సాయపడుతున్నారు. దీంతో చాలామంది తమకు దొరికిన అవకాశాన్ని పలు రకాలుగా సద్వినియోగం చేసుకుంటున్నారు.

పనిమనుషులు కూడా ఇళ్లకే పరిమితం కావడంతో వారి లేని లోటు తీరుస్తూ భర్తలు బార్యకు పనిలోసహకరిస్తున్నారు. ఈ విషయంలో రాజకీయ నాయకులు కూడా అతీతులేం కాదని తాజాగా బయటకు వచ్చిన ఓ ఫొటో నిరూపిస్తోంది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య చీపురుపట్టి వంటగదిని శుభ్రం చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Related posts