telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

రక్తనాళాలలో కొవ్వును కరిగించే… రామబాణం… ఇదే..

pomegranate and its health benefits

శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభం అయితే, నెమ్మదిగా అది రక్తనాళాలలో కూడా పేరుకుపోతుంది. దానితో రక్తసరఫరా కోసం గుండె మరింత శ్రమ పడాల్సి వస్తుంది. దానితో గుండె సంబంధిత జబ్బులు మొదలవుతాయి. అందుకే అధికబరువు అత్యంత ప్రమాదకరం. దీనికి మంచి విరుగుడు కూడా ఉంది, దానిని పాటిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయని వైద్యనిపుణులు సలహాలు ఇస్తున్నారు. అదేమంటే, ఎరుపు రంగులో ఆకర్షణీయంగా ఉండే దానిమ్మ పండులో ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. అనేక పోష‌కాల‌కు నిధిగా దానిమ్మ పండ్లను చెపుతారు. ఫైబ‌ర్‌, ఫొలేట్‌, పొటాషియం, మెగ్నిషియం, విట‌మిన్ సి, కె, త‌దితర పోష‌కాలు ఈ పండ్ల‌లో పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల దానిమ్మ పండ్ల‌ను త‌ర‌చూ తింటే ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అలాగే ప‌లు అనారోగ్య స‌మస్య‌లు కూడా రాకుండా చూసుకోవ‌చ్చు. అవేమిటో ఇక్కడ చూద్దాం..

* దానిమ్మ పండ్ల‌ను రోజూ తింటుంటే ర‌క్త నాళాల్లో పేరుకుపోయే కొవ్వు క‌రుగుతుంది. దీని వ‌ల్ల గుండెకు ర‌క్తం బాగా స‌ర‌ఫ‌రా అవుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. అలాగే ఈ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.

* కీళ్ల ద‌గ్గ‌ర వాపులు తీవ్రంగా వ‌స్తే కీళ్ల నొప్పుల స‌మ‌స్యలు వ‌స్తాయి. వీటిని త‌గ్గించుకోవాల‌న్నా, ఈ స‌మ‌స్య‌లు రాకుండా ఉండాల‌న్నా నిత్యం దానిమ్మ పండును తినాలి. లేదా ఆ పండు జ్యూస్ తాగాలి.

* దానిమ్మ పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ట్యూమ‌ర్ గుణాలు ఉన్నందున క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి. వీటిలో ఉండే ప్యూనిసిక్ యాసిడ్ బ్రెస్ట్ క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంది. దీంతో బ్రెస్ట్ క్యాన్స‌ర్ రాకుండా ఉంటుంది. అలాగే ప్రోస్టేట్ క్యాన్స‌ర్ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

* హైబీపీ ఉన్న‌వారు నిత్యం దానిమ్మ పండు జ్యూస్‌ను తాగాలి. అలాగే ఈ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల బాక్టీరియా, వైర‌ల్‌, ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి.

* నిత్యం వ్యాయామం చేసేవారికి దానిమ్మ పండ్ల జ్యూస్ మంచి శ‌క్తినిస్తుంది. కోల్పోయిన శ‌క్తిని తిరిగి ఇవ్వ‌డంతోపాటు పోష‌కాల‌ను కూడా అందిస్తుంది.

Related posts