telugu navyamedia
news political Telangana VOTE

నక్సల్స్ ప్రభావిత నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

TS-Poling

తెలంగాణలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని సిర్పూర్ కాగజ్ నగర్, చెన్నూర్, బెల్లంపల్లి, పినపాక, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, ఇల్లెందు, కొత్తగూడెం, ఆశ్వరావుపేట, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక గంట ముందుగానే పోలింగ్ ముగిసింది. ఈ నియోజకవర్గాల్లో మావోయిస్టు ప్రాబల్యం ఉన్నందున గంట ముందుగానే పోలింగ్ ను నిలిపివేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తే పోలింగ్ బాక్స్ లను తరలించేందుకు ఇబ్బందయ్యే అవకాశం ఉందని భావించిన అధికారులు ఇలా ముందుగానే పోలింగ్ ముగించారు. ఈ నియోజక వర్గాల్లో 56 శాతం ఓట్లు నమోదయ్యాయి. మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఇంకా ఓటు వేయనివారు ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.

Related posts

ఎస్బిఐ .. పెట్రోల్ ఆఫర్ .. పొడిగింపు…

vimala p

మొక్క…

vimala p

కియా తో .. ప్రభుత్వం ఎంఓయూ …

vimala p