telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అసెంబ్లీ ఎన్నికల కన్నా 12 శాతం తగ్గిన పోలింగ్!

After 11 Parishat Elections Telangana

తెలంగాణలో డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైద్రాబాద్ మినహా జిల్లాల్లో భారీగా పోలింగ్ నమోదు అయింది. లోక్ సభ ఎన్నికలు వచ్చేసరికి పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల కన్నా 12 శాతానికిపైగా తగ్గిపోయింది. దీంతో ఓటర్లలో ఇంత మార్పు ఎందుకువచ్చిందన్న చర్చ జరుగుతోంది. అయితే ఇందుకు పలు కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఉండడం, అదే రోజు ఏపీలో ఎన్నికలు ఉండడం వల్ల పోలింగ్ శాతం తగ్గినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఎండలు మండిపోవడంతో పోలింగ్ శాతం పడిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

గురువారం తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోయాయి. నల్గొండలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా హైదరాబాద్ లో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోడానికి ప్రజలు పెద్దఎత్తున కదిలారు. 73.02 శాతం పోలింగ్ నమోదయింది. కానీ అప్పటితో పోలిస్తే లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రజలు అంతగా ఆసక్తి కనబర్చలేదు.

Related posts