telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

సుశాంత్ ఆత్మహత్యపై షానూ శర్మను విచారించిన పోలీసులు!

shanu sharma

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై పోలీసులు అన్నీ కోణాల్లో ధర్యాప్తు చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి ఒత్తిళ్లు వచ్చాయా? అన్న కోణంలోకూడా పోలీసులు విచారణ చేపట్టారు. యష్ రాజ్ ఫిల్మ్స్ లో కాస్టింగ్ డైరెక్టర్ గా ఎంతో పేరు తెచ్చుకున్న షానూ శర్మను విచారించారు. రణ్ వీర్ సింగ్, అర్జున్ కపూర్, వాణీ కపూర్ వంటి వారిలోని టాలెంట్ ను గుర్తించిన ఆమె, యష్ రాజ్ ఫిల్మ్స్ సినిమాల్లో అవకాశాలు ఇప్పించి, వారు ఫేమస్ అయ్యేందుకు సహకరించారు.

ఈ నెల 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకోగా, పోస్టుమార్టం నివేదికలో కూడా, ఆయనే స్వయంగా మెడకు ఉరి బిగించుకున్నారని, మరెవరి ప్రమేయమూ లేదని తేల్చారు. అయితే, బాలీవుడ్ లోని కొందరు పెద్దలు సుశాంత్ కు అవకాశాలు లేకుండా చేశారని, ఈ కారణంతోనే డిప్రెషన్ లో కూరుకుపోయి సుశాంత్ ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారంటూ, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో పోలీసులు కేసును క్లోజ్ చేయకుండా విచారణ కొనసాగిస్తున్నారు.

Related posts