telugu navyamedia
political Telangana

కాజీపేటలో రూ.3.59 కోట్ల నగదు పట్టివేత

last day campaign and its time for
తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్‌కు కొన్ని గంటలే గడువు ఉన్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటకొస్తున్నాయి. తాజాగా  కాజీపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి భారీ ఎత్తున నగదు పట్టుబడింది. ఓటర్లకు పంచేందుకు సిద్దంగా ఉన్న రూ.3.59కోట్ల నగదును వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
వర్ధన్నపేట  మహాకూటమికి చెందిన అభ్యర్థి పి. దేవయ్యకు సంబంధించిన ఈ మొత్తన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన ప్రావిన్స్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.రవీందర్‌ మీడియాకు వెల్లడించారు. పోలీసులు  అర్ధ రాత్రి తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రావిన్స్‌రెడ్డి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని విచారించగా ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన నగదు పట్ట్టుబడింది.

Related posts

వైసీపీకి మద్దతుపై నిర్ణయం తెలిపిన కేటీఆర్

vimala p

ఏపీకి వెళ్తా జగన్ కు ప్రచారం చేస్తా: అసదుద్దీన్‌ ఒవైసీ

vimala p

టీఆర్‌ఎస్‌ పార్టీతో ఉత్తమ్‌ లాలూచీ: గజ్జెల కాంతం

vimala p