telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

రవిప్రకాష్‌ కోసం బెంగళూరులో గాలింపు!

Ravi Prakash

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ పరారీలో ఉన్నారు. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చినా రవిప్రకాష్‌ స్పందించలేదు. ఇప్పటికే సైబర్‌ క్రైం పోలీసులు రవిప్రకాష్‌పై లుకౌట్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రవిప్రకాష్‌తో పాటు సినీ నటుడు, గరుడ శివాజీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరులో ప్రత్యేకబృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

పరిస్థితులు చూస్తుంటే రవిప్రకాష్‌కు అన్ని దారులు మూసుకుపోయేలా కనిపిస్తున్నాయి. టీవీ 9 సంస్థలో ప్రధాన వాటాదారుగా అలంద మీడియా సంస్థ ఇప్పటికే యాజమాన్య భాధ్యతలు చేపట్టింది. రవిప్రకాష్‌ని సీఈవో బాధ్యతల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

కాగా రవిప్రకాష్‌ ఫోర్జ‌రీ, డేటా చోరీ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ వ్య‌వ‌హారంలో ఇప్ప‌టికే రెండుసార్లు సీఆర్పీసీ సెక్ష‌న్ 160 ప్ర‌కారం ఈ నెల 9, 11వ తేదీల్లో సైబ‌రాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయినా రవిప్రకాష్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో రవిప్రకాష్‌తో పాటు నటుడు శివాజీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.

Related posts