telugu navyamedia
సినిమా వార్తలు

నాగార్జున ఇంటి చుట్టూ పోలీసు ఫోర్స్… బిగ్ బాస్ ఎఫెక్ట్

starmaa official on bigg boss 3 telugu

బిగ్ బాస్ తెలుగు సీజన్ -3 ప్రారంభం కాకముందే వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ బిగ్ బాస్ పై యాంకర్ శ్వేతారెడ్డి సంచనల కామెంట్స్ చేసింది. నటి గాయత్రి గుప్తా కూడా రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకా షో ప్రారంభం కాకముందే వివాదాస్పదమవుతోంది. ఇక ఈషోలో మితిమీరిన అడల్ట్ కంటెంట్ ఉండబోతోంది అంటూ వస్తున్న వార్తలకు స్పందించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు ‘బిగ్ బాస్ 3’ బ్యాన్ చేయాలి అంటూ నాగార్జున ఇంటిని ఈరోజు చుట్టుముట్టడానికి పిలుపును ఇచ్చిన నేపథ్యంలో… నాగార్జున ఇంటి చుట్టూ అధిక సంఖ్యలో పోలీసు ఫోర్స్ ను సెక్యూరిటీగా పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ‘బిగ్ బాస్ 3’ షోలో ప్రసారం చేసే అంశాలు ముందుగా సెన్సారింగ్ చేయాలి అంటు మహిళా సంఘాల నుండి కూడ విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. దీనితో ‘బిగ్ బాస్ 3’ షో అసలు సజావుగా జరుగుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి. మరోవైపు రేపు ఈషో విషయమై తమ అభ్యంతరాలు తెలియచేస్తూ కొందరు రేపు సుప్రీమ్ కోర్టులో పిల్ కూడ వేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో జాతీయ స్థాయిలో ‘బిగ్ బాస్’ షోను నిషేధించాలంటూ భారీగా ఉద్యమం జరగబోతోంది. అయితే ఇన్ని పరిణామాలు జరుగుతున్నా నాగార్జున ఒక్క మాట కూడ మాట్లాడక పోవడం ఆశ్చర్యకరం. ఇక “బిగ్ బాస్” నిర్వాహకులు మాత్రం షోను ప్రారంభం చేయబోతున్నాము అంటూ ప్రోమోలు విడుదల చేస్తున్నారు.

Related posts