telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

జర్నలిస్ట్ హత్య… వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

New couples attack SR Nagar

తూర్పుగోదావరి జిల్లా తునిలో జర్నలిస్ట్ హత్యకేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విలేఖరి సత్యనారాయణ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేశారు. వీరిలో వైఎస్సార్‌‌సీపీ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో పాటూ మరో ఐదుగురిపై కేసు నమోదయ్యింది. ఆరో నిందితుడిగా ఎమ్మెల్యే పేరును చేర్చారు. ఈ కేసులో పోలీసులు విచారణ కొనసాగుతోందని పెద్దాపురం డీఎస్పీ తెలిపారు. రెండు రోజుల క్రితం (15-102019) రాత్రి తుని మండలం ఎస్‌.అన్నవరం దగ్గర సత్యనారాయణను హత్య చేశారు. ఆయన టి.వెంకటాపురం నుంచి ఎస్‌.అన్నవరం వెళుతుండగా గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా నరికి చంపారు. సత్యనారాయణ ఆంధ్రజ్యోతి పత్రికకు తొండంగి మండలానికి విలేకరిగా పని చేస్తున్నారు. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రతిపక్షనేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణలు ఈ హత్యను ఖండించారు. ఈ ఘటనపై సమాచారశాఖ మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ ఈ ఘటనపై చాలా సీరియస్‌గా తీసుకున్నారని.. డీజీపీతో కూడా మాట్లాడినట్లు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. తాజాగా సత్యనారాయణ భార్య ఫిర్యాదుతో కేసు నమోదయ్యింది.

Related posts