telugu navyamedia
రాజకీయ

చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు.. అధికారులపై సస్పెన్షన్ వేటు

dvivedi on poling percentage and evm rumours
మొన్న ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విధుల పట్ల  నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులపై ఈసీ  సీరియస్ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. మండపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మారేడుబాక గ్రామంలోని 108 పోలింగ్ బూత్‌కు చెందిన వీవీప్యాట్ స్లిప్పులు, ఓటరు స్లిప్పులు చెత్త కుప్పలో దొరికాయి. 
దీంతో  బీజేపీ అభ్యర్ధి అయ్యాజీ వేమా  ఈ విషయమై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. వీవీప్యాట్‌స్లిప్పులు, ఓటరు స్లిప్పులు చెత్త కుప్పలో దొరికిన ఘటనపై రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వరరావు సీరియస్ అయ్యారు. ఈ పోలింగ్ బూత్‌లో విధుల్లో ఉన్న ప్రిసైడింగ్ అధికారి గంట లత, ఏపీఓలపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు వీరిద్దరిపై మండపేట పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు కూడా నమోదైంది.

Related posts