telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

నగరం నడిరోడ్డుపై “ఖాకీల”  కయ్యం!

bhandra police fight 1

నగరం నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఇద్దరు పోలీసులు కాలర్ పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని భాంద్రా పట్టణంలో చోటు చేసుకుంది. భాంద్రాలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పోలీసులు విధుల్లో ఉన్నారు. వీరిలో ఇద్దరు పోలీసులు ఉన్నట్టుండి కొట్టుకున్నారు. షూతో దాడి చేసుకున్నారు.

అంతటితో ఆగకుండా గల్లాలు పట్టుకుని ఆవేశానికి లోనయ్యారు. ఒక పోలీసు అయితే అక్కడున్న రాయిని మరో పోలీసుపైకి వేసేందుకు ప్రయత్నించడంతో.. ఓ వ్యక్తి వచ్చి అడ్డుకున్నాడు. అయితే అడ్డుకున్న ఆ వ్యక్తిపై మరో పోలీసు చేయి చేసుకున్నాడు. మొత్తానికి ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు.

Related posts