telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

మైనర్ ను కొట్టిన పోలీసులు .. ముగ్గురి పై సస్పెన్షన్ వేటు

New couples attack SR Nagar

రోడ్డు పై వెళ్తున్నా ఓ మైనర్ పై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. మంగళవారం ముగ్గురు పోలీస్ అధికారులు ఆ మైనర్ ను కొట్టారు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ రాష్టంలోని రాయ్ పూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు మైనర్ ను జుట్టు పట్టుకుని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంటనే స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు ముగ్గురి పై సస్పెన్షన్ వేటువేశారు.

మైనర్ పై పోలీసులు దాడికి పాల్పడిన వీడియోను చూశాం. వీడియో పుటేజీని పరిశీలించిన వెంటనే ఆ ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశామని రాయ్ పూర్ అదనపు ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.

Related posts