telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నకిలీ విజయ్ దేవరకొండను అరెస్ట్ చేసిన పోలీసులు

vijay

సోషల్ మీడియాలో తానే విజయ్ దేవరకొండ అని పరిచయం చేసుకుంటూ అమ్మాయిలను ట్రాప్ చేస్తూ మోసానికి పాల్పడుతున్న యువకుడిని సైబర్ క్రైం పోలీసుల సహాయంతో చాకచక్యంగా పట్టుకున్నారు విజయ్ దేవరకొండ టీమ్. మోసగాడి ఫోన్ నెంబర్‌ని కనిపెట్టి అతనితో ఒక అమ్మాయిలా పరిచయం చేసుకుని అతను చెప్పిన మాటలన్నీ నమ్మినట్లు నటించి నిన్ను వెంటనే కలవాలి అని హైదరాబాద్‌కి రమ్మని చెప్పడం జరిగింది.ఈ మాటలన్నీ నమ్మిన ఆ మోసగాడు వెంటనే హైదరాబాద్ బయల్దేరి వచ్చాడు..అంతే అప్పటికే పోలీసులతో రెడీ గా ఉన్న విజయదేవరకొండ టీమ్ అతడిని పట్టుకుని స్టేషన్ కి తరలించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతుండగా, ఈ విచారణలో సదరు వ్యక్తి కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాంతకి చెందిన వ్యక్తి అని తెలిసింది.

Related posts